బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2023 (14:28 IST)

జగన్ పార్టీ వైకాపాను వీడనున్న 50 మంది ఎమ్మెల్యేలు?!!

raghuramakrishnamraju
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన సొంత పార్టీ వైకాపాను ఆ పార్టీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది పార్టీని వీడినున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీకి చెందిన రెబెల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. కృష్ణాతో పాటు జిల్లాలకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలంతా పక్క చూపులు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. దీంతో వైకాపాలో ప్రకంపనలు మొదలయ్యాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ మాకొద్దు అంటే మాకొద్దని ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటున్నారంటే, వైకాపా మునిగిపోయే పడవని వారికి అర్థమైందన్నారు. 
 
ప్రజా తీర్పు అధికార వైకాపాకు వ్యతిరేకమని తేలడంతో, చిల్లుపడిన పడవ నుంచి దూకి ఒడ్డుకు చేరుకునేందుకు చాలామంది ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోందన్నారు. వైకాపా అధిష్ఠానం అరాచకాలు, శాసనసభ్యులను అగౌరవపరచడం, అమానవీయంగా ప్రవర్తించడం వంటి సంఘటనలు వారిని తీవ్రంగా కలిచి వేసి, ఆ నిర్ణయానికి పురిగొల్పాయన్నారు. ప్రస్తుత శాసన సభ్యుల్లో 75 నుంచి 80 మందిని మారుస్తారని తెలిసిందన్నారు. చిలకలూరిపేటలో పనికిరాని మంత్రి రజిని గుంటూరులో ఎలా పనికివస్తారని ఆయన ప్రశ్నించారు.