శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 జూన్ 2024 (12:35 IST)

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు... ఇద్దరు బాలికల ఆత్మహత్య.. ఇంట్లో ఎవరూ..?

suicide
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఓ బాలికను బలి తీసుకుంది. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిరిసిల్ల - తంగళ్లపల్లిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన తోకల సోనీ(17) ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన సోనీ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది.
 
అదేవిధంగా కరీంనగర్ - జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన శ్యామల వైష్ణవి(17) అనే బాలిక కూడా ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. దీంతో పురుగుల మందుతాగింది. 
 
అయితే కొద్దిరోజులుగా ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.