శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. శ్రీరామనవమి
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2024 (20:06 IST)

భద్రాచలం సీతమ్మకు సిరిసిల్ల నుంచి పెళ్లి చీర.. వెండి పోగులతో..?

Lord Rama
శ్రీరామనవమి రోజున భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 17వ తేదీన జరిగిన ఈ మహోత్సవానికి అన్నీ సిద్ధం అయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో సీతారాములపై తనకున్న భక్తిని మరోసారి చాటుకున్నారు సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్. చేనేత కళానైపుణ్యంతో మగ్గంపై బంగారం వెండి పోగులతో పట్టుచీర నేసి తన ప్రతిభ చాటుకుంటున్నారు. 
 
మరోవైపు భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా జరిగే సీతారామ చంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది.
 
ఇకపోతే.. భద్రాచలం రామాలయంలో ఆరు రకాల మూర్తులు ఉన్నాయి. ఇందులో కల్యాణమూర్తి ప్రత్యేకమైనది. శ్రీరంగం నుంచి తీసుకొచ్చిన రామలక్ష్మణ విగ్రహాలు, ఫణిగిరి నుంచి తెచ్చిన సీతమ్మ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సీతారాముల వారికే శ్రీరామనవమి రోజున కల్యాణం చేస్తుండటంతో ప్రత్యేకత సంతరించుకుంది. 
 
మరోవైపు శ్రీరామనవమి రోజు జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి తేదీని అర్చకులు ఖరారు చేశారు. ఏప్రిల్ 9 నుంచి 23 వరకు వసంత పక్షప్రయుక్త శ్రీరామనవమి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 
 
ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 16న సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవం, 17న ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఏప్రిల్ 18న శ్రీరాముని మహా పట్టాభిషేకం వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.