సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 25 మార్చి 2024 (16:23 IST)

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడుగా నటుడు బాబూ మోహన్!!

babu mohan - ka paul
తెలంగాణా రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడుగా సినీ నటుడు బాబూ మోహన్‌ను ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. సోమవారం హైదరాబాద్ నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ, ప్రజల కోరిక మేరకు తెలంగాణాలోని 17 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. ప్రజాశాంతి పార్టీ తరపున తొలి అభ్యర్థిగా వరంగల్ స్థానానికి బాబూ మోహన్ పేరును ప్రకటిస్తున్నట్టు చెప్పారు. తమ పార్టీలో సినీ నటుడు బాబూ మోహన్ చేరిన తర్వాత అనేక మంది కార్యకర్తలు, నేతలు తమ పార్టీలో చేరేందుకు వస్తున్నారని తెలిపారు. 
 
నిజం చెప్పాలంటే తెలంగాణా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంకు లేదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగు ఏక్‌నాథ్ షిండేలను తయారు చేసిందని ఆయన ఎద్దేవా చేశారు. వీరిలో రేవంత్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు ఉన్నారని, మరో నేత కూడా షిండే అవకాశాలు సమీపంలోనే ఉన్నాయన్నారు. వందేళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ నుంచి నీళ్లు కూడా ఇవ్వలేదని, విద్యుత్ కోతలు కూడా మొదలయ్యాయని విమర్శించారు. 
 
వయనాడ్‌లో రాహుల్ గాంధీపై పోటీ చేసే బీజేపీ అభ్యర్థి ఎవరు? 
 
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి సీపీఐ తరపున డి.రాజా సతీమణి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి పేరును కమలం పార్టీ ప్రకటించింది. కేరళ రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ఉన్న సురేంద్రన్ పేరును రాహుల్ ప్రత్యర్థిగా ప్రకటించారు. కోళికోడ్‌కు చెందిన సురేంద్రన్ పేరును బీజేపీ తాజాగా ప్రకటించిన ఐదో జాబితాలో వెల్లడించింది. ఇదే లిస్టులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ తదితర పేర్లు ఉన్నాయి. అభిజిత్ స్వచ్ఛంధ విరమణ తీసుకున్న విషయం తెల్సిందే. 
 
అయితే, బీజేపీ ప్రత్యర్థిగా బరిలో నిలిచిన సురేంద్రన్ గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో పత్తినంపట్టి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కమ్యూనిస్టుల తర్వాత మూడో స్థానంలో నిలించారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన మంజేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే, 2019లో జరిగిన ఉప ఎన్నికల్ల కూడా ఆయనకు ఓటమి ఎదురైంది. 2020లో కేరళ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి వ్యతిరేంగా ఆయన పోరాడి ప్రజలకు బాగా దగ్గరయ్యారు. ఈ పోరాటం ద్వారా ఆయన వ్యక్తిగత ఛరిష్మాతో పాటు.. బీజేపీని కూడా జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళగలిగారు. దీంతో వయనాడ్ స్థానం ఇపుడు వీఐపీ సెగ్మెంట్‌గా మారిపోయింది.