గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2024 (21:17 IST)

మోదీ పిరికి రాజకీయ నాయకుడు.. కవిత అరెస్ట్‌పై కేసీఆర్

kcrao
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేసీఆర్ కుమార్తె కె.కవిత అరెస్టయిన నెల రోజుల తర్వాత, కేసీఆర్ ఎట్టకేలకు బహిరంగ వేదికపై ఈ విషయంపై స్పందిచారు. ఢిల్లీ లిక్కర్ కేసు తమ ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ తెరతీసిన రాజకీయ ప్రతీకార కేసు తప్ప మరొకటి కాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
 
"మోదీ పిరికి రాజకీయ నాయకుడు, అసెంబ్లీలో మా బలం 111 ఉండగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను లాక్కోవాలని ప్రయత్నించాడు. కాబట్టి, ఇప్పుడు ఈ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఎందుకు వదిలేస్తాడు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాశనం చేసేందుకు తప్పకుండా ప్రయత్నిస్తాడు." అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించాడు. 
 
సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీలోకి వెళ్లే ఉద్దేశం ఉండొచ్చని, అయితే ఏకనాథ్ షిండే కావడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు లేదని కేసీఆర్ అన్నారు. దానికి తోడు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నారని కేసీఆర్ చెప్పారు.