గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (22:41 IST)

72 గంటల తర్వాత జ్వరం నుంచి కోలుకున్నా.. కేటీఆర్

ktrao
72 గంటల తర్వాత జ్వరం నుంచి కోలుకున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆదివారం ప్రకటించారు. సోమ, మంగళవారాల్లో రాజేంద్రనగర్‌, అంబర్‌పేట నియోజకవర్గాల్లోని మూసీ నది ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
గత 36 గంటలుగా జ్వరం, దగ్గు, జలుబుతో చికిత్స పొందుతున్నానని, వైద్య సలహాను అనుసరించి, యాంటీవైరల్, యాంటీబయాటిక్ మందులు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
 
అమృత్ పథకం టెండర్ల అంశంపై కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిన ఢిల్లీలో ఉన్న బీజేపీ కూడా కాపాడటం కష్టమేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయక తప్పదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 
 
"బావమరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా? బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోం. ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్‌లోనే ఆయన బావమరిది శోద కంపెనీకి రూ.1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజం" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.