1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Maoists Gajarla Ravi, Aruna killed in encounter in Maredumilli forests in Andhra Pradesh

Maoists Gajarla Ravi: అలిపిరి అడవుల్లో బాబుపై బాంబు దాడి-మావో చలపతి భార్య అరుణ మృతి

Mavoists
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో పోలీసులకు, సీపీఐ (మావోయిస్ట్) పార్టీ కార్యకర్తలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు సహా ముగ్గురు మావోయిస్టులు బుధవారం మృతి చెందారు.
 
ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు నక్సల్స్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ బిరుసు, ఏఓబీ సభ్యుడు వెంకట రవి లక్ష్మీ చైతన్య అలియాస్ అరుణ ఉన్నారు. మరో నక్సల్‌ను ఇంకా గుర్తించలేదు. 
 
2003లో అలిపిరి అడవుల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జరిగిన బాంబు దాడిలో కీలక పాత్ర పోషించిన మావోయిస్టు చలపతి భార్య అరుణ. ఆమె తల్లి మావి, సోదరుడు ఆజాద్ కూడా మావోయిస్టు పార్టీలో ఉన్నారు. గతంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో మరణించారు. 
 
మంగళవారం సాయంత్రం మావోయిస్టుల ఉనికి గురించి అందిన సమాచారం మేరకు మారేడుమిల్లి అడవుల్లో ఏపీ పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారని వర్గాలు తెలిపాయి. ఈ ఎన్‌కౌంటర్ తెల్లవారుజామున జరిగింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి AK-47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
తర్వాతి కథనం
Godavari-Banakacherla Link Project: గోదావరి-బనకచెర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదు