బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 29 డిశెంబరు 2024 (20:44 IST)

Kavitha: కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక కేటీఆర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు..

Kavitha
Kavitha
అక్రమ కేసులో అరెస్టయి జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం తొలిసారి నిజామాబాద్‌ పర్యటనకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చారు. తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను... దేనికీ భయపడను అంటూ కవిత తెలిపారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం.. దమ్ములేక తపై, కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తమని తెలిపారు. 
 
ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర, రాష్ట్ర పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోంది. రాష్ట్రంలో అక్రమ కేసులపై గురించి చెప్పనవసరం లేదని గుర్తుచేశారు. 
 
పనిలో పనిగా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. రైతులు భూములు ఇవ్వకపోయినా రేవంత్‌ రెడ్డి కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. బరువు ఎత్తుకున్నోడు ఓపికతో ఉండాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికే అధికారం ఇచ్చారనే విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మరిచిపోయాయని విమర్శించారు.