సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 1 జనవరి 2024 (18:04 IST)

అపర్ణ 17 డిగ్రీల నార్త్‌లో పైరేట్ థీమ్ న్యూ ఇయర్ పార్టీ

Aparna 17 Degrees North
17 డిగ్రీస్ నార్త్ ఆధ్వర్యంలోని పైరేట్-ఇన్ఫ్యూజ్డ్ న్యూ ఇయర్ పార్టీ ఉత్సాహభరితమైన వాతావరణంలో విజయవంతమైన ఏడాదికి ముగింపు పలుకుతూ సరికొత్తగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించింది. క్రిస్మస్‌కు మించిన వేడుకలతో డిసెంబర్ 31 రాత్రి నిర్వహించిన ఈ పార్టీలో అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ ఆధ్వరంలోని క్లబ్ మెంబెర్స్ పాల్గొని నూతన ప్రణాళికలకు ఆహ్వానం పలికారు. ఈ సంధర్భంగా అంబరాన్నంటిన సంబరాల్లో క్లబ్ సభ్యులు పైరేట్ శైలిలో ఉత్సాహంగా 2024 ఏడాదిని స్వీకరించారు. ఇందులో భాగంగా సాయంకాలం ఏర్పాటు సంగీత విభావరి, విలాసవంతమైన విందు తదితర కార్యక్రమాలు స్వాష్‌బక్లింగ్ థీమ్‌కు సరిపోయేలా వేడుకను తారాస్థాయికి తీసుకెళ్లాయి.
 
ఈ నేపథ్యంలో క్లబ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ రామకృష్ణ మాట్లాడుతూ... “ఈ న్యూ ఇయర్ ఈవెంట్ ఊహించిన దాని కంటే అద్భుతమైన  స్పందనను చూసింది. ఈ పరిణామం అపర్ణ 17 డిగ్రీస్ నార్త్ కు పెరుగుతున్న ఆకర్షణను చెప్పకనే చెబుతుందని అన్నారు.  క్లబ్ వైవిధ్యభరితమైన పని విధానాలు, అంకితభావంతో కూడిన సేవలు తమ కమ్యూనిటీని మరింత వృద్ధిలోకి తీసుకు వచ్చినదని, ఇది క్లబ్ నిబద్ధతకు నిదర్శమన్నారు. 
 
అపర్ణ 17 డిగ్రీస్ నార్త్: వినూత్నమైన పద్దతులతో, వైవిధ్యంతో క్లబ్ సభ్యులు, నిర్దిష్ట ప్రేక్షకుల అవసరాలను తీర్చడంలో ముందుంటూ అన్ని వేదికల్లో అపర్ణ 17 డిగ్రీస్ నార్త్ స్వర్గధామంలా మారిందని పేర్కొన్నారు. ఇది కేవలం క్లబ్ కాదు, సంస్థ ఆధ్వర్యంలోని క్లబ్ కార్యకలాపాలు విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన అత్యుత్తమ పోకడలు, అధునాతమైన విధానాలకు అద్దం పడుతుందని అన్నారు. ఈ ప్రత్యేకతలే 17 డిగ్రీస్ నార్త్ బార్‌ను పెంచుతూనే.., నూతన ఉత్తేజకరమైన అంశాలను పరిచయం చేస్తోందన్నారు.
 
అంతేకాకుండా ఇటీవలే ప్రారంభించబడిన బౌలింగ్ అల్లే మరియు అద్భుతమైన VR గేమింగ్ సౌకర్యం సమకాలీన అంశాలను జోడించి, క్లబ్ యొక్క అంకితభావాన్ని ధృవీకరిస్తుందని పేర్కొన్నారు.