అయ్యో... చిన్నారిని అన్యాయంగా చంపాసారే...
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. 3 నెలల పసికందు ఆరోగ్యం కోసం వస్తే అతడు అకాల మృత్యువు పాలయ్యాడు. పల్స్ పోలియో చుక్కలు వేసిన కాసేపటికే చిన్నారి మృతి చెందినట్లు బిడ్డ తల్లిదండ్రులు ఆరోపిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. పసిబిడ్డకు పోలియో చుక్కలు వేసాక ఇంటికి తీసుకుని వచ్చామనీ, ఇంటికి వచ్చాక కొద్దిసేపటికే బాలుడు వాంతులు చేసుకుని పాలు తాగకుండా ఏడుస్తూనే వున్నాడన్నారు.
దీనితో పసిబిడ్డను తిరిగి ఆసుపత్రికి తీసుకువస్తే.. అందరికీ వేసినట్లే చిన్నారికి కూడా పోలియో చుక్కలు వేసినట్లు సిబ్బంది తెలిపారు. ఐతే పోలియో చుక్కలు అతిగా వేయడమో లేదంటే కాలం తీరిని మందు ఉపయోగించడమో చేయడం వల్ల తమ బిడ్డ ప్రాణం పోయిందని వారు ఆరోపిస్తున్నారు.