1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 జనవరి 2024 (13:33 IST)

హైదరాబాబాద్ పంజాగుట్ట పోలీస్ సిబ్బంది అందిరిపై బదిలీ వేటు...!!!

srinivasa reddy
హైదరాబాద్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్ని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న సిబ్బంది అందరిపై బదిలీవేటు పడింది. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలాగే, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలోని పోలీస్ సిబ్బందిని ఎంపిక చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. 
 
కాగా, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన, నమోదయ్యే కేసుల విషయంలో గత కొంతకాలంగా జరుగతున్న పరిణామాల నేపథ్యంలో సీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బోథన్ మాజీ ఎమ్మెల్యే తనయుడి వ్యవహారంతో పాటు వివిధ కేసులకు సంబంధించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.