మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2023 (20:34 IST)

గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన నిర్ణయం.. ఏంటది?

Anna Rambabu
Anna Rambabu
ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ ఎవరిని పెట్టినా గెలిపించాలని క్యాడర్‌కు అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. 
 
కాగా, తాను వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
 
‘ప్రస్తుత రాజకీయాల్లో నేను రాలేను. నా బాధను పార్టీ నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదని బాధగా ఉంది. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట కుటుంబం 34 ఏళ్లుగా ఈ జిల్లాకు ఏం చేసింది? రానున్న ఎన్నికల్లో జిల్లా ప్రజలు మాగుంట కుటుంబాన్ని ఆదుకున్నారు. మాగుంటను ఓడించేందుకు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తామన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో తొలిసారి ఎమ్మెల్యే అయ్యాను.
 
కొందరు నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేసి అవమానించారు, కులం పేరుతో దూషించారు. నేను డబ్బు తీసుకుని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. జిల్లాకు చెందిన రాజకీయ నేతలు సైతం కొందరు నన్ను టార్గెట్ చేస్తూ కులం పేరుతో దూషిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 2024లో పోటీ చేయనని జగన్‌కు చెప్పాను.. కానీ ఆయన అంగీకరించలేదు. నేను పార్టీ మారను. నా రాజకీయ ప్రయాణం జగన్ తోనే" అని అన్నా రాంబాబు అన్నారు.