ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జూన్ 2024 (16:56 IST)

తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్న సోనియా గాంధీ

sonia gandhi
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ మాజీ అధినేత్రి, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ హాజరుకావడం లేదు. అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారు. 
 
ఈ వేడుకలకు సోనియా గాంధీని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లారు. ఆహ్వానాన్ని మన్నించిన సోనియా గాంధీ ఈ కార్యక్రమానికి హాజరవుతానని హామీ ఇచ్చారు. 
 
షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం ఆమె హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీ ఈ పర్యటనకు సంబంధించి తన వ్యక్తిగత వైద్యుని సలహా కోరారు. 
 
ఆరోగ్య కారణాల రీత్యా యాత్రకు దూరంగా ఉండాలని వైద్యుల సూచన మేరకు సోనియా గాంధీ తెలంగాణ పర్యటనను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఆరోగ్య కారణాల రీత్యా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రకటించింది.