శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 డిశెంబరు 2023 (08:19 IST)

తెలంగాణాలో ఇంటర్ పరీక్షలు ఎపుడంటే..

students telangana
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో భాగంగా, ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రాక్టికల్స్ పరీక్షలను నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు థియరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే, ప్రాక్టికల్స్ మాత్రం రెండు సెషన్లలో ఉంటాయని ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. 
 
కాగా, ఇంటర్ జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన ప్రాక్టికల్స్ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తారు. రెండో శనివారం, ఆదివారాల్లో కూడా ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయని బోర్డు అధికారులు వెల్లడించారు. అలాగే, ఇంటర్ మొదటి సంవత్సరంర విద్యార్థులకు మాత్రం ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఫిబ్రవరి 16వ తేదీ ఉంటుందని తెలిపారు. 
 
మాకొద్దీ ఈ సంబరాల రాంబాబు... అంబటి రాంబాబుకు అసమ్మతి సెగ... 
 
ఏపీ జలవనరుల శాఖామంత్రి, వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబుకు అసమ్మతి సెగ తగిలింది. మాకొద్దీ సంబరాలు రాంబాబు అంటూ వైకాపా నేతలు తాడేపల్లి ప్యాలెస్‌కు క్యూకట్టారు. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు దాదాపు వంద మంది వరకు గురువారం ఉదయం తాడేపల్లికి వెళ్లి అధిష్టానానికి తమ నిరసన గళం వినిపించారు. ఎంపీ, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. 
 
అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వొద్దంటూ వారు విజ్ఞప్తి చేశారు. సంబరాల రాంబాబుకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని, మరొకరికి ఇస్తే మాత్రం విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఇలా తమ నిరసన గళాన్ని వినిపించిన వారిలో విజయకుమారి కోటిరెడ్డి, అలేఖ్య కృపాకరరావు, సయ్యద్ సీమారఫి, రమేష్ రెడ్డి, రోశిరెడ్డి, మహేంద్ర, భూలక్ష్మి విజయకుమార్, అనిల్ కుమార్, వెంకట కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. 
 
ఆ తర్వాత వారంతా సంయుక్తంగా విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం నుంచి పని చేసిన వారిని రాంబాబు పక్కకు నెట్టేశారు. పార్టీని సర్వనాశనం చేశారు. బ్రోకర్లను పెట్టుకుని దోచుకుంటున్నారు. గ్రామాల్లో పార్టీ రెడు గ్రూపులుగా మారిపోయేందుకు అంబటి రాంబాబు కారకులయ్యారు. సంబరాల రాంబాబు మాకొద్దు.. అంబటి రాంబాబు అస్సలు వద్దనే వద్దు అంటూ నినాదాలు చేశారు.