శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 నవంబరు 2024 (12:41 IST)

కేటీఆర్ పాదయాత్ర ప్లాన్.. ఎందుకో తెలుసా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..?

ktramarao
తెలుగు రాష్ట్రాల్లో కొందరు నేతలు పాదయాత్ర చేసి సక్సెస్ అయ్యారు. కేటీఆర్ కూడా అదే ప్లాన్‌ను వర్కవుట్ చేయాలని చూస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా, అటు కేడర్‌లో ఉత్సాహం, ఇటు కేసీఆర్ తర్వాత తానేనన్న సంకేతం చాలా స్ట్రాంగ్‌గా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. పార్టీలో చాలా రోజులుగా నెంబర్ 2 రచ్చ జరుగుతోంది
 
ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు, ప్రభుత్వాన్ని క్లీనర్ల వద్దకు తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలన్న అభ్యర్థనలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సానుకూలంగా స్పందించారు.
 
కేసీఆర్ బహుశా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాలకు గుడ్ బై చెప్తారనే ప్రచారం జరుగుతోంది. కేవలం, పరోక్ష సహకారం మాత్రమే అందిస్తారని అంటున్నారు. దీనిపై చర్చ జరిగాకే కేటీఆర్ పాదయాత్ర ప్రకటన చేసి ఉంటారని తెగ మాట్లాడుకుంటున్నారు.