ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2024 (17:14 IST)

తెలంగాణలో నవంబర్ 6వ తేదీ నుంచి కుల గణన

telangana govt
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 6వ తేదీన కుల గణనను ప్రారంభించనుంది. దేశంలోనే ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితర నేతలతో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ విషయంపై అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు. కాగా, సర్వే ప్రారంభం రోజున రాహుల్ గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. 
 
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మేలు జరిగేలా కుల గణనపై అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి చర్చిస్తామన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు.