బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 20 ఏప్రియల్ 2024 (17:11 IST)

హైదరాబాద్ లోక్ సభ భాజపా అభ్యర్థి మాధవీలతను నెట్టేసిన మహిళ, ఎందుకు?- Video

woman who pushed Hyderabad Lok Sabha BJP candidate Madhavilatha
హైదరాబాద్ లోక్ సభ భాజపా అభ్యర్థి మాధవీలత ఎండలను సైతం లెక్కచేయకుండా నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటు వేయాలనీ, తద్వారా దేశంలో మరోసారి మోదీ ప్రభుత్వాన్ని తీసుకురావాలంటూ చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఓ బస్తీలోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఓ మహిళతో తనకు ఓటు వేయాలని అడిగారు.
 
ఐతే ఆ మహిళ కరపత్రం తీసుకున్న తర్వాత మాధవీలతను నెట్టివేస్తూ కనిపించింది. ఐతే వారి మధ్య జరిగిన సంభాషణ ఏమిటో తెలియలేదు కానీ మాధవీలతను మహిళ నెట్టివేసిన వీడియో మాత్రం వైరల్ అయ్యింది. ఆ దృశ్యాన్ని చిత్రీకరించినవారిపై మాధవీలత ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు కూడా కనబడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.