ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (12:16 IST)

తెలంగాణాలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఎమ్మెల్యే!!

trs car symbol
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి షాకులపై షాకులు తగులుతున్నాయి. గత యేడాది డిసెంబరు నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతూ, ఆ పార్టీలో చేరిపోతున్నారు. తాజాగా రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. 
 
మరోవైపు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. పార్టీ నేతలతో పాటు కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో కీలకంగా ఉండే ద్వితీయ శ్రేణి నేతలను ప్రోత్సహించేలా వారు చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు, మాజీ సీఎం కేసీఆర్ సైతం ఇదే అంశంపై దృష్టిసారించి, పార్టీ నేతలతో సమాచాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం.