శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 11 ఏప్రియల్ 2024 (11:57 IST)

వైసిపిలో చేరిన జనసేన నాయకుడు: దరిద్రం పోయిందంటూ బాణసంచా కాల్చిన కార్యకర్తలు

Nellore YCP
నెల్లూరు జనసేన అధ్యక్షుడు వైసిపిలోకి చేరగానే బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు జనసేన కార్యకర్తలు. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు పెద్దఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
 
నెల్లూరులో జనసేనకు పట్టిన దరిద్రం వదిలిపోయిందంటూ వ్యాఖ్యలు చేసారు. ఒక వ్యక్తి పార్టీ మారి వెళ్లిపోతే చాలాచోట్ల గందరగోళం నెలకొంటుంది. కానీ నెల్లూరులో ఇందుకు భిన్నంగా కార్యకర్తలు బాణసంచా కాల్చి పండుకు చేసుకున్నారు. చూడండి ఈ వీడియోలో...