ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2024 (14:16 IST)

వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్-గన్నవరం ఎమ్మెల్యే బైబై.. కాంగ్రెస్‌లో చేరిక

Kondeti Chittibabu
Kondeti Chittibabu
వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో ప్రచారం నిర్వహిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో చిట్టిబాబు కాంగ్రెస్‌లో చేరారు.
 
పి.గన్నవరం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన కొండేటి చిట్టిబాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పి.గన్నవరం టిక్కెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని విప్పర్తి వేణుగోపాల్‌కు సీఎం జగన్ కేటాయించారు. 
 
దీంతో అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే చిట్టిబాబు.. శనివారం పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే చిట్టిబాబు పార్టీ మారడం విశేషం.