శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 జనవరి 2024 (12:14 IST)

సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్- కోటి రూపాయల బీమా రెడీ

Singareni
సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్. సింగరేణి ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీమా కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు సింగరేణి ఉద్యోగులకు ప్రమాద బీమా రూ.40 లక్షలుగా ఉంది. 
 
సింగరేణి సీఎండీ బలరాం ఆదేశాలతో సంస్థ అధికారులు బ్యాంకు వర్గాలతో చర్చించారు. తాజా చర్చల అనంతరం ఇప్పుడది కోటి రూపాయలకు పెరిగింది. 
 
ఇందులో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగిన సింగరేణి ఉద్యోగులకు ఇకపై రూ.1 కోటి వరకు ప్రమాద బీమా లభించనుందని బ్యాంక్ వెల్లడించింది. ఈ కొత్త బీమా పథకాన్ని ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు.