సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 నవంబరు 2023 (17:05 IST)

సింగరేణి ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఖాతాలోకి రూ.85వేలు

Singareni
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే అదిరే శుభవార్త అందింది. సింగరేణి ఉద్యోగులకు దీపావళి బోనస్ రూ.85 వేలు మొత్తాన్ని మంగళవారం యాజమాన్యం చెల్లించింది.
 
ప్రతి ఏడాది కోలిండియాలో దసరా ముందుగా బోనస్ పంపిణీ చేస్తుండగా సింగరేణిలో దీపావళి పండుగ ముందు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. 
 
దీపావళి బోనస్ సకాలంలో చెల్లించడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోలిండియా యాజమాన్యంతో కార్మిక సంఘాలు చేసుకున్న ఒప్పందం మేరకు ఈ మొత్తాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది.