శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 జూన్ 2024 (11:38 IST)

కామారెడ్డి: రోడ్డుపై చిరుత పులి.. కారు బోల్తా.. మహిళ మృతి

Leopard
కామారెడ్డిలో చిరుత కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ఎల్లమ్మకుంట-అమ్రాబాద్ మధ్య రోడ్డుపై చిరుత పులిని గుర్తించిన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కారు బోల్తా పడడంతో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలిని గాంధారి మండలం యాచారంకు చెందిన మాలోత్ లలిత (30)గా గుర్తించారు. 
 
వివరాల ప్రకారం.. లలిత, ఆమె భర్త మాలోత్ ప్రభాకర్ మంగళవారం మోపాల్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. మోపాల్ నుంచి యాచారంలోని తమ ఇంటికి కారులో తిరిగి వస్తున్నారు.
 
వీరి కారు ఎల్లమ్మకుంట-అమ్రాబాద్ మధ్య అటవీ ప్రాంతానికి చేరుకోగానే.. రోడ్డుపై చిరుత పులిని గమనించిన ప్రభాకర్ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. కారు వేగంగా రావడంతో రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని ఢీకొని బోల్తా పడింది. 
 
దీంతో మాలోత్ లలిత అక్కడికక్కడే మృతి చెందగా, ప్రభాకర్ తలకు గాయమైంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.