పుణ్యమొస్తదని ఇంత పులిహోర ప్రసాదం నోట్లో వేసుకున్నారు
పుణ్యమొస్తదని ఇంత పులిహోర ప్రసాదం నోట్లో వేసుకున్నారు ఆసుపత్రి పాలయ్యారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లింగంపల్లిలో గణేష్ నవరాత్రులు వైభవంగా ముగియడంతో గణనాధుడుని నిమజ్జనం రోజు యాత్ర నిర్వహించారు. నిమజ్జనం రోజున నిర్వాహకులు పులిహార ప్రసాదంగా పంపిణీ చేశారు. ఆ ప్రసాదం కోసం భక్తులు అందరూ క్యూ కట్టారు.
ప్రసాదం తింటే పుణ్యం వస్తుందని ఆశపడి ప్రసాదం కోసం ఎగబడి తిన్నారు. అయితే ఆ పులిహోర తిని 100 మంది వరకూ ఆసుపత్రి పాలయ్యారు. అందులో 10 మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. కడుపునొప్పి, వాంతులు, జ్వరం రావడంతో ఆసుపత్రి వర్గాలు జ్వరాలు సీజన్ అని అనుకున్నారు.
తీరా 100 మంది వరకూ ఆసుపత్రులకు చేరడంతో అసలు ఏజరిగిందని డాక్టర్లు క్లూ లాగితే అసలు విషయం బయటకు వచ్చింది. నిర్వహకులు పంచిన ప్రసాదం మూలంగానే ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు పెద్దరూ అందరూ ఆసుపత్రి పాలయ్యారు. అందుకే ప్రసాదం అని పంచగానే తినకుండా కాస్త జాగ్రత్తులు తీసుకోండని చెబుతున్నారు డాక్టర్లు. అసలే తెలంగాణ అంతటా జ్వరాలు ప్రబలడంతో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు డాక్టర్లు.