మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2023 (08:20 IST)

ప్రాణం తీసిన అతివేగం.. హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడిన యువతి మృతి

road accident
హైదరాబాద్ నగరంలో అతివేగం ఓ యువతి ప్రాణం తీసింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ వంతెనపై నుంచి కిందపడిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. కోల్‌కతాకు చెందిన స్వీటి పాండే (22) స్నేహితుడు రాయన్ ల్యుకేతో కలిసి జేఎన్‌టీయూ నుంచి ఐకియా వైపు ద్విచక్రవాహనంపై బయలుదేరింది. రాయల్ ల్యుకే బైకును అమిత వేగంతో డ్రైవ్ చేస్తూ ఫ్లైఓవర్ సేఫ్టీ వాల్‌‍ను ఢీకొట్టాడు. 
 
దీంతో బైకు వెనుక భాగంలో కూర్చొనివున్న స్వీటి పాండే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ పైనుంచి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. రాయన్ ల్యుకేకు కూడా గాయపడగా అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.