మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2023 (17:29 IST)

నేను పెళ్లి చేసుకుంటే అలా చేసుకుంటా : సంతోష్‌ శోభన్‌

Santosh Shobhan
Santosh Shobhan
ఇప్పుడు యంగ్‌ హీరోలలో సంతోష్‌ శోభన్‌ ఒకరు. అన్నీ శుభశకునములే సినిమా వైజయంతీ బేనర్‌లో వచ్చినా అది పెద్దగా ఆడలేదు. మంచి కథ ఎందుకని ఆడలేదో తనకూ అర్థంకాలేదని సంతోష్‌ శోభన్‌ చెప్పాడు. ఇప్పుడు పెండ్లి నేపథ్యంలో ప్రేమ్‌కుమార్‌ అనే సినిమా చేశాడు. ఈనెల 18నే విడుదలకాబోతుంది. ఈ సినిమాలో పాయింట్‌ వినగానే ఎంతగానో నచ్చింది. 
 
1990 నుంచి 200వరకు మనం చాలా సినిమాల్లో పెండ్లి జరుగుతుండగా.. ఆగండి.. అంటూ హీరో రావడం, హీరోయిన్‌ ఫాదర్‌ను కన్వీన్స్‌ చేయడం పెళ్లిపీటలపై వున్న హారోయిన్‌ను పెండ్లి చేసుకోవడం జరుగుతుంది. కానీ అప్పటికే పీటలపై వున్న పెండ్లికొడుకు గురించి ఎవ్వరూ పట్టించుకోరు. ఓ జోకర్‌లా అనిపిస్తుంది. అలాంటి వాడిపై కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది అని సంతోష్‌ శోభన్‌ చెప్పారు. ఈ సినిమా షూటింగ్‌లో పంచె కట్టుకుని పరుగెత్తాను. అది చాలా కష్టంగా అనిపించింది.

అందుకే ఇక నేను పెండ్లిచేసుకుంటే రిజిష్టర్‌ మ్యారేజ్‌ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఇంటిలో పెండ్లి గురించి అడగలేదు. తర్వాత ఏం సినిమా చేస్తున్నావ్‌! అనే మా మదర్‌ అడుగుతుంది. టైం వచ్చినప్పుడు నేనే చెబుతాను అని తెలిపారు.