మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (13:53 IST)

నకిలీ ఫేస్ బుక్ ఐడీ.. స్వాతిరెడ్డి పేరుతో వేధింపులు

నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను క్రియేట్‌ చేసి ఓ యువతిని వేధిస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కథనం ప్రకారం... ధూలపల్లికి చెందిన మోహన్‌ కృష్ణ వర్మ తన ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి మన్సూరాబా

నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను క్రియేట్‌ చేసి ఓ యువతిని వేధిస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కథనం ప్రకారం... ధూలపల్లికి చెందిన మోహన్‌ కృష్ణ వర్మ తన ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి మన్సూరాబాద్‌కు చెందిన ఓ యువతి ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. 
 
అనంతరం స్వాతిరెడ్డి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా క్రియేట్‌ చేసి బాధితురాలి ఫొటోను ప్రొఫైల్‌ పిక్చర్‌గా పెట్టుకొని బాధితురాలి ఫ్రెండ్స్‌కు రిక్వెస్ట్‌లు పంపాడు. ఆ తర్వాత అసభ్యకర సందేశాలు పంపించేవాడు. తన స్నేహితురాలి ద్వారా ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మోహన్‌ కృష్ణ వర్మను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.