శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (14:41 IST)

మా నాన్న ఆరోగ్యం సీరియస్‌గా ఉంది... ఎంపీ ధర్మపురి అరవింద్

ds son
తన తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్యం విషమంగా ఉందని ఆయన కుమారుడు, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు. ఇదే విషయంపై ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశారు. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ సోమవారం తీవ్ర అస్వస్థతకు లోనై హైదరాబాద్ బంజార హిల్స్‌లోని న్యూరో సిటీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మారై స్కాన్ తదితర పరీక్షలను చేస్తున్నారు. ఈ వైద్య పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఒక మీడియా బులిటెన్ విడుదల చేయనున్నారు. 
 
దీనిపై ధర్మపురి అరవింద్ స్పందించారు. తన తండ్రి ఆరోగ్యం క్రిటికల్‌గా ఉందని పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని చెప్పారు. అందువల్ల ఈ రోజు రేపు తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్ చేశారు.