1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 11 డిశెంబరు 2022 (11:30 IST)

అర్థరాత్రి షర్మిల దీక్ష భగ్నం... ఆస్పత్రికి తరలింపు

sharmila
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. శనివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో లోటస్ పాండ్‌కు చేరుకున్న పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిర్మిత్తం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. 
 
తన పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని ఆమె అంతకుముందు ప్రకటించారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వడంలేదని ఆమె ప్రశ్నించారు. 
 
తన పాదయాత్రలో ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ పార్టీ కార్యాలయం చుట్టూ కర్ఫ్యూ ఎత్తివేసి అరెస్టు చేసిన నాయకులను తక్షణం విడుదల చేసేంతవరకు దీక్షను ఆపబోనని ఆమె ప్రటించారు. కాగా, షర్మిలకు మద్దతు ఆమె తల్లి విజయలక్ష్మి కూడా దీక్షకు దిగారు.