గురువారం, 21 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2022 (18:55 IST)

రోహిత్ మంచి డ్యాన్సర్, యాక్టర్ : లవ్ యూ రామ్ టీజర్ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

K Dasharath, Harish Shankar, Minister Puvwada Ajay Kumar, Rohit Behal, Aparna
K Dasharath, Harish Shankar, Minister Puvwada Ajay Kumar, Rohit Behal, Aparna
దర్శకుడు కె దశరథ్ అందిస్తున్న కథతో తెరకెక్కుతున్న చిత్రం 'లవ్ యూ రామ్'. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ , థీమ్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్  వచ్చింది. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ లాంచ్ చేశారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాంగ్ టీజర్ ని విడుదల చేశారు.
 
లీడ్ పెయిర్, వారి భిన్నమైన పాత్రలను పరిచయం చేయడం ద్వారా సినిమా బేసిక్ ప్లాట్ లైన్ ని ఆసక్తికంరగా రివిల్ చేశారు. లీడ్ పెయిర్ చిన్నప్పటి నుండి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అబ్బాయే తనకు సర్వస్వం అని అమ్మాయి భావిస్తుంది. కానీ అతని అసలు క్యారెక్టర్ గురించి తెలుసుకున్నప్పుడు ఆమె మోసపోయినట్లు భావిస్తుంది. భిన్నమైన మనస్తత్వం ఉన్న ఇద్దరి ప్రేమకథ ఎక్కడ ముగుస్తుందో కథలో కీలకాంశం.
 
లవ్‌స్టోరీతో పాటు సినిమాలోని ఎమోషనల్‌ పార్ట్‌ను కూడా టీజర్‌లో చూపించారు. లవ్ యు రామ్ దశరధ్ మార్క్ రొమాంటిక్ , ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని టీజర్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. రోహిత్ బెహల్ ట్రెండీగా కనిపించారు. అపర్ణ జనార్దనన్ యాప్ట్ ఛాయిస్. డివై చౌదరి సబ్జెక్ట్ ని చాలా కన్విన్సింగ్‌గా డీల్ చేసారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. సినిమాటోగ్రాఫర్ సాయి సంతోష్ , సంగీత దర్శకుడు కె వేద బ్రిలియంట్ వర్క్ చేశారు. ఈ చిత్రానికి ఎస్‌బి ఉద్ధవ్ ఎడిటర్, గురు మురళీకృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
 
టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. దశరధ్, డివై చౌదరి గారి నా బెస్ట్ విశేష్. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. రోహిత్ నాట్యం సినిమా చూశాను. అతనిలో చాలా మంచి డ్యాన్సర్, యాక్టర్ వున్నారు. లవ్ యూ రామ్ సినిమా అతనికి మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను. అలాగే అపర్ణాకి కూడా ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో పాటలు కూడా అద్భుతంగా వున్నాయి. దశరధ్ గారు అద్భుతమైన చిత్రాలు అందించిన దర్శకుడు. నిర్మాత కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుతున్నాను. సినిమా మంచి విజయం సాధించి  సినిమాలో పని చేసినందరికీ మంచి పేరు రావాలి'' అని కోరారు.  
 
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. లవ్ యూ రామ్ దశరధ్ గారి స్టయిల్ లో ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఎంటర్ టైనింగ్ తీశారు. ఈ సినిమాని నార్వే లో షూట్ చేశారు. విజువల్స్ చాలా రిచ్ గా వున్నాయి. రోహిత్, అపర్ణ అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. మన చౌదరి గారికి సినిమా తప్పా మరో ప్రపంచం తెలీదు. సినిమాని ప్రేమించే వ్యక్తి. కొన్ని సినిమాలని నిర్మించాలంటే దర్శకులే నిర్మాతలు కావాలి. ఆ నమ్మకం డైరెక్టర్లకే వుండాలి. దశరధ్ గారు ఈ సినిమాకి ప్రాణం పెట్టి చేశారు. సినిమా చూసిన నమ్మకంతో చెబుతున్నాను. మీరంతా ఖచ్చితంగా ఆడరిస్తాని అనుకుంటున్నాను. ఇందులో దశరధ్ కూడా ఒక పాత్ర పోషించారు. చాలా మంచి పాత్ర అది. ఈ సినిమా తర్వాత ఆయన నటుడిగా కూడా బిజీ అవ్వడం ఖాయం. ఇందులో అద్భుతమైన మ్యూజిక్ వుంది. ఇందులో వుండే ఒక హిందీ పాట ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. కథ, మ్యూజిక్, ప్రొడక్షన్, లోకేషన్స్, నటీనటులు హైలట్. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది'' అన్నారు
 
కె దశరథ్ మాట్లాడుతూ.. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తమ్ముడు హరీష్ శంకర్ కి కృతజ్ఞతలు. హరీష్ చాలా మంచి మనసున్న మనిషి. నలుగురికి సాయం చేయాలని తపిస్తాడు.  'లవ్ యూ రామ్' సినిమాకి హరి పని చేశారు. మిస్టర్ పర్ఫెక్ట్ తో మా జర్నీ మొదలైయింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ చిత్రానికి పని చేశారు. తన ఋణం తీర్చుకోలేను.  ఈ సినిమా కోసం చాలా మంది ప్రతిభగ యువకులు పని చేశారు. స్క్రీన్ ప్లే కిషోర్, శివ అందించారు. ప్రవీణ్ వర్మ మాటలు రాస్తున్నారు. ఉద్ధవ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కె వేద మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా సినిమాకి బ్యాక్ బోన్ గా ఉంటున్న దొడ్దా రవి గారికి థాంక్స్.'' తెలిపారు
 
డివై చౌదరీ మాట్లాడుతూ... మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, హరీష్ శంకర్ గారికి కృతజ్ఞతలు. ఖమ్మం షూటింగ్ లో అజయ్ గారు చాలా సహకారం అందించారు. హరీష్ కూడా తన విలువైన సూచునలు ఇచ్చారు. ఇందులో దశరథ్ గారు నటించారు.  చాలా మంచి నటన కనబరిచారు. టీం అంతా ఎంతో హార్డ్ వర్క్ చేసి సినిమా చేశాం. సినిమాకి ప్రేక్షకుల ఆదరణ కావాలి'' అని కోరారు.
 
రోహిత్ బెహల్ మాట్లాడుతూ.. దశరధ్ , డివై చౌదరిగారికి కృతజ్ఞతలు. రామ్ పాత్ర నేను చేయగలనని నమ్మారు.  మంత్రి అజయ్ గారు నాట్యం సినిమా చూసి కాంప్లీమెంట్ ఇవ్వడం ఆనందంగా వుంది. అపర్ణ తో కలసి నటించడం ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం ఏడాదిగా కష్టపడ్డాం. టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనే ఎక్సయిట్ మెంట్ వుంది. ఇందులో దశరథ్ గారు కూడా నటించారు. ఆయనతో చేసిన సీన్స్ ని చాలా ఎంజాయ్ చేశాను.  ఈ ప్రాజెక్ట్ భాగం కావడం ఎంతో అనందంగా వుంది.'' అన్నారు
 
అపర్ణ మాట్లాడుతూ.. నా తొలి తెలుగు సినిమా టీజర్ లాంచ్ కావడం చాలా ఆనందంగా వుంది. మీ అందరి ప్రేమ, సపోర్ట్ కావాలి'' అన్నారు.
 
సుధాకర్ బొర్రా (టేనస్సీ), డి నాగేశ్వర్ రావు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ గోపు, శివ మొక్క స్క్రీన్ ప్లే అందించారు. ప్రవీణ్ వర్మ మాటలు రాశారు.
 
సాయి సంతోష్ కెమరామెన్ గా, ఎస్.బి ఉద్ధవ్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కె వేద మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది.
 
తారాగణం: రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్, బెనర్జీ, ప్రదీప్, కాదంబరి కిరణ్, కార్టూనిస్ట్ మల్లిక్, మీర్, కె దశరధ్, డివై చౌదరి, ప్రభావతి వర్మ, శాంతి దేవగుడి తదితరులు