శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2023 (11:39 IST)

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏపీ హైకోర్టు మహిళా జడ్జి

ap high court judge
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు మహిళా న్యాయమూర్తి వి.సుజాత తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా చివ్వెల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వర్షంలో న్యాయమూర్తి కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో న్యాయమూర్తి తీవ్రంగా గాయపడటంతో ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్‌లో హైదరాబాద్ నగరానికి తరలించారు. 
 
న్యాయమూర్తి ప్రయాణిస్తున్న కారు చివ్వెల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలియగానే తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి ఆమెను మెరుగైన చికిత్స కోసం తన కాన్వాయ్‌లో హైదరాబాద్ నగరానికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమై జాతీయ రహదారి పొడవునా కాన్వాయ్‌కు అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.