హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో మమతా బెనర్జీకి గాయాలు
ఉత్తర బెంగాల్‌లోని తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గాయాలు అయ్యాయి. మంగళవారం సాయంత్రం కోల్‌కతాకు చేరుకున్న వెంటనే ఆమెను నేరుగా ఎయిర్‌పోర్టు నుంచి ఎస్ఎస్‌కేఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఎయిర్‌పోర్టు దగ్గరే మమతా బెనర్జీ కోసం ఒక అంబులెన్స్‌ను సిద్ధంచేశారు. అయితే, ఆమె తన కారులోనే ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమెకు అక్కడ వీల్‌చైర్ ఏర్పాటు చేశారు. ఆమె నడవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. ల్యాండింగ్ సమయంలో మమత కాలు, వెన్నుకు గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు.