గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్

దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్ ... పేద సీఎం మమతా బెనర్జీ

ysjaganmohan
తాను నిరుపేద ముఖ్యమంత్రి అని స్వయంగా ప్రకటించుకున్న ఏపీ సీఎం, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని తేలింది. అలాగే, దేశంలో నిరుపేద ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ తేలారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకటించిన జాబితా ద్వారా వెలుగులోకి వచ్చింది. అలాగే, దేశంలో అత్యంత నిరుపేద ముఖ్యమంత్రిగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిలిచారు. ఈమె రూ.15 లక్షలతో చిట్టచివరి స్థానంలో ఉన్నారు. ఎన్నికల నామినేషన్ల దాఖలు సమయంలో ఇపుడు ముఖ్యమంత్రులుగా ఉన్న వారు సమర్పించిన ఎన్నికల ప్రమాణ పత్రాలను పరిశీలించిన తర్వాత ఏడీఆర్ ఈ వివరాలను బహిర్గతం చేసింది. 
 
ఈ ముఖ్యమంత్రుల్లో 13 మందిపై తీవ్రమైన నేరాలు ఉన్నాయి. వీటిలో నేరాలు, హత్య, హత్యాయత్నం, అపహరణ, బెదిరింపులు వంటి కేసులు ఉన్నాయి. ఈ తీవ్రమైన నేరాలన్నీ నాన్ బెయిలబుల్, ఐదేళ్లకు పైగా శిక్ష విధించే కేసులు కావడం గమనార్హం. ఈ జాబితా ప్రకారం మొత్తం 29 మంది ముఖ్యమంత్రులు ఆస్తుల సంయుక్త విలువు రూ.508 కోట్లు కాగా, ఒక్క జన్మోహన్ రెడ్డి ఆస్తి విలువే రూ.510.38 కోట్లుగా ఉంది. 
 
ఇందులో రూ.43 కోట్ల చరాస్తులు, మిగతావన్ని స్థిరాస్తులుగా ఉన్నాయి. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేస్తున్న వారి ఆస్తుల వివరాలను ఏడీఆర్ వివరించింది. ఈ జాబితాలో చివరి స్థానంలో రూ.15 లక్షల ఆస్తులతో మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిచారు. జగన్ తర్వాతి స్థానంలో రూ.163 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రెండో స్థానంలో నిలిచారు.