గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2023 (18:55 IST)

అచ్యుతాపురం సెజ్‌లో పేలుడు.. ఇద్దరు మృతి

blast
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరోమారు భారీ ప్రమాదం జరిగింది. సాహితీ ఫార్మాలో పేలుడు సంభవించింది. దీంతో ఘటనా స్థలిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ సెజ్‌‍లోని భారీ శబ్దంతో పేలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా మరికొందరు గాయపడ్డారు. భారీ శబ్దాలు రావడంతో ఉద్యోగులు, కార్మికులు, స్థానికులు ప్రాణభయంతో దూరంగా పరుగులు తీశారు. 
 
ఈ ఘటన గురించిన సమాచారం అందుకున్న అగ్నిమాదకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. గత జనవరిలో కూడా లాలంకోడూరు సమీపంలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్‌లో పేలింది. ఈ ప్రమాదంలో ఒక చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు.