శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 అక్టోబరు 2022 (09:59 IST)

బాన్సువాడలో 2 వేల నాటి పాత్ర ... మట్టిదిబ్బపై లభ్యం

stoneware
తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండువేల సంవత్సరాల నాటి పాత్ర లభ్యమైంది. ఈ మేరకు తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ పొరఫెసర్, పబ్లిక్ రీసెర్స్ ఇనిస్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ హెరిటేజ్ సంస్థ (ప్రిహా) ప్రధాన కార్యదర్శి ఎంఏ శ్రీనివాస్‌లు వెల్లడించారు. 
 
బాన్సువాడ సమీపంలోని బోర్లాం గ్రామంలో ఓ మట్టిదిబ్బపై ఈ పాత్ర లభించినట్టు వారు వెల్లడించారు. దీనిపై క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ప్రాకృత బాష, బ్రహ్మీ లిపిలో లఘుశాసనం ఉన్నట్టు తెలిపారు. 
 
మంజీరా నదీ పరీవాహక ప్రాంతంలో దొరికిన బ్రహ్మీ లఘు శాసనాల్లో ఇది ఆరోదని వారు తెలిపారు. మంజీరా నదికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఇది లభించినట్టు వెల్లడించారు. దీనిని శాతవాహన కాలం నాటి చారిత్రక అవశేషగంగా గుర్తించినట్టు చెప్పారు. 
 
పాత్రపై ఉన్న శాసనంలో హిమాబుధియ అనే ఐదు అక్షరాలతో బ్రహ్మీ లిపి ఉందన్న ఆయన హిమా పదానికి స్త్రీ బౌద్ధ భిక్షువు అని అర్థం కావొచ్చని ఈ పాత్రను పరిశీలించిన ఎపిగ్రఫిస్ట్ మునిరత్నం రెడ్డి వెల్లడించారు.