శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 20 జూన్ 2017 (17:50 IST)

శిరీష లిస్టులో మరో కొత్త ఫ్రెండ్... ప్లీజ్ వాళ్లిద్దరి వివరాలు కావాలంటూ...(వీడియో)

బ్యూటీషియన్ శిరీష కేసును తవ్వేకొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. శిరీష, ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఐతే వాళ్లిద్దరివీ ఆత్మహత్యలు కాదనీ, హత్యలు వారివారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసుకు సంబంధి

బ్యూటీషియన్ శిరీష కేసును తవ్వేకొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. శిరీష, ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఐతే వాళ్లిద్దరివీ ఆత్మహత్యలు కాదనీ, హత్యలు వారివారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు మరింత లోతుగా వెళ్లి శిరీష కాల్ లిస్టు పరిశీలిస్తున్నారు. 
 
ఈ క్రమంలో శిరీష మరో కొత్త ఫ్రెండుకు ఫోన్ చేసి ఓ విషయాన్ని అభ్యర్థించినట్లు తెలిసింది. ఆ వ్యక్తి పేరు నవీన్. ఇతడు రాజీవ్‌కు స్నేహితుడు. రాజీవ్-తేజస్వినులు ఏం మాట్లాడుకున్నారో దానికి సంబంధించిన టేపులు తనకు కావాలనీ, వాటిని ఎలాగైనా తనకు సంపాదించి పెట్టాలని అతడిని కోరినట్లు కాల్ డేటాలో వుంది. మరి అతడు సాయం చేశాడా లేదా అనేది విచారణలో తేలాల్సి వుంది.