ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ దూరం?
స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండడంతో గులాబీ పార్టీలో సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో సీఎం కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్సీలకు ఈసారి అవకాశం దక్కే సూచనలు లేవని తెలుస్తోంది. ఈ ఎన్నికలకు బీజేపీ దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై పీసీసీ నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ విషయంపై దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై పార్టీ నేతలతో చర్చించామని తెలిపారు.
ఎన్నికల్లో డబ్బు ప్రభావం పై కూడా చర్చ జరిగిందని, ఇంకా కొంతమంది నేతల అభిప్రాయం సేకరించాక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ నిర్ణయం హైకమాండ్‌కు తెలిపి, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ప్రకటిస్తామని వివరించారు.
ఎన్నికల్లో అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు తో ఓటర్ల ను ప్రలోభపెడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన లోకల్ బాడీ నేతలలో సగం మందిని అధికార పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నుంచి పోచంపల్లి సోమవారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.