బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 24 జులై 2019 (19:24 IST)

కారు డోర్స్ లాక్... ఊపిరాడక ప్రాణం విడిచిన ఇద్దరు చిన్నారులు

నిజామాబాద్ ముజాహిద్ నగర్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు కారులో ఎక్కి ఊపిరాడక చనిపోయారు. రియాజ్‌ (10), మొహమ్మద్‌ బద్రుద్దీన్‌ (5) ఇద్దరూ అక్కాచెల్లెళ్ల పిల్లలు. ఈ పిల్లలు మంగళవారం మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లి కాలనీలో పార్క్‌ చేసి ఉన్న కారు వెనుక సీట్లో ఎక్కి కూర్చున్నారు. 
 
అప్పటికే కారు అద్దాలు మూసి ఉండటంతో ఒక్కసారిగా కారు డోర్లు లాక్‌ అయ్యాయి. దీంతో ఇద్దరూ ప్రాణాలు విడిచారు. పిల్లల జాడ తెలియకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి  తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతకినా లాభం లేకపోయింది. 
 
ఇంతలో కారు యజమాని ఇద్దరు చిన్నారులు మృతదేహాలను కారులో గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. అయితే చిన్నారుల తల్లిదండ్రులు మాత్రం డోర్ లాక్ చేసి ఉన్న కారులోకి పిల్లలు ఎలా వెళ్లి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.