సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 17 జూన్ 2019 (15:02 IST)

ఏపీ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టిన త‌మ్మారెడ్డి..! ఏంటా నిర్ణ‌యం..?

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్ర‌జా సంక్షేమ‌మే త‌న ల‌క్ష్యంగా దూసుకెళుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పటిదాకా ప్రజా సంక్షేమ పథకాలు బాగానే అమలు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఇదే ఊపులో జగన్ తీసుకున్న ఒక నిర్ణయంపై చుట్టూ పక్కల నుండి విమర్శలు వస్తున్నాయి. ఇంత‌కీ ఏంటా నిర్ణ‌యం అంటారా..?
 
పిల్లలను స్కూల్‌కి పంపే ప్రతి తల్లికి 15 వేలు ఇస్తానని చెప్పాడు. అయితే ఈ పథకం అనేది కేవలం ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపే తల్లులకు మాత్రమే 15 వేలు ఇస్తే బాగుంటుందని, అలా కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు పంపే తల్లులకు కూడా ఇస్తే అది మొదటికే మోసం వస్తుందని, దాని వలన ప్రభుత్వ పాఠశాలలు మరింత హీనస్థితికి చేరుతాయనే వాదనలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
 
ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా దీనిపై స్పందించారు. ఇంత‌కీ ఆయ‌న వాద‌న ఏంటంటే.... బాగా ఒళ్ళు బలిసిన వాళ్లే తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన వాళ్లే ప్రభుత్వ పాఠశాలలకు వస్తారు. కాబట్టి ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థి తల్లులకు ఇస్తే బాగుంటుంది. అవసరం అయితే 15 వేలుని పెంచి 20 వేలు ఇచ్చినా ఇంకా బాగుంటుంది. అదేవిధంగా గతంలో ప్రవేశపెట్టిన స్కాలర్‌షిప్ లోని కొన్ని లొసుగుల వలన అది అక్రమాల బాట పట్టింది, దానిని గమనించి జగన్ ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుందని ఆయ‌న చెప్పారు.