శర్వానంద్ అతనికి ఓకే చెప్పాడా..? శర్వా చేస్తుంది రైటా..? రాంగా..?
యువ కథానాయకుడు శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం రణరంగం. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పైన రూపొందుతోంది. ఆగష్టు 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ఇటీవల అఫిషియల్ గా ఎనౌన్స్ చేసారు. ఈ సినిమా తర్వాత శర్వానంద్ 96 రీమేక్‌లో నటిస్తున్నాడు.
అయితే... శర్వానంద్‌తో సినిమాలు చేసేందుకు దర్శకులు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. శర్వాతో సినిమా చేయనున్నారు అంటూ చాలా మంది యువ దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే...తాజాగా ప్రచారంలో లేని ఓ దర్శకుని పేరు తెర పైకి వచ్చింది. అతనే...రాజు సుందరం. హీరోలతో స్టెప్పులు వేయించే రాజు సుందరం అప్పుడప్పుడు తెరపై కనిపిస్తుంటారు. ఆయన అజిత్ నటించిన ‘ఏగన్’ అనే తమిళ చిత్రంతో దర్శకుడుగా మారారు.
ఇప్పుడు శర్వానంద్‌తో సినిమా చేయాలనుకుంటున్నారట. రాజు సుందరం చెప్పిన లైన్ నచ్చడంతో ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయ్ మని చెప్పారట శర్వానంద్. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుందని...ఈ సంవత్సరం చివరిలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని తెలిసింది. అయితే..శర్వా కోసం యువ దర్శకులు చాలామంది రెడీగా ఉంటే...రాజు సుందరంకి ఓకే చెప్పడం అనేది రాంగ్ డిషిషన్ అని కామెంట్ చేస్తున్నారు. మరి..శర్వా చేస్తుంది రైటా..? రాంగా..? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.