Biodata Maker
✕

కరోనా మరో ఆరు నెలలు ఉండొచ్చు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

Written By ఎం
Updated: గురువారం, 7 మే 2020 (19:28 IST)
కరోనా ప్రభావం మరో ఆరు నెలలు ఉండవచ్చని, అప్పటి వరకు ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

గురువారం మునుగోడు నియోజకవర్గంలో తన తల్లి కోమటిరెడ్డి సుశిలమ్మ పౌండషన్ ద్వారా పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌లో పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సరుకులు పంచుతున్నామని తెలిపారు. 40వేల కుటుంబాలకు మూడు కోట్లతో నిత్యవసరాలు ఇస్తున్నామని చెప్పారు.

తన తల్లి సుశీలమ్మ పౌండేషన్ ద్వారా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే అన్నారు. రాజకీయాలకు అతీతంగా నిజమైన పేదలకు సరుకులు అందజేస్తున్నామన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.

ఆర్ధికంగా ఉన్న వాళ్ళు ఆపన్నహస్తం అందించాల్సిన తరుణం ఇది అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

అన్నీ చూడండి

Vishwadev Rachakonda: డార్క్ చాక్లెట్ లో మాటలతో ఎంగేజ్ చేసే ఒక ప్రయోగం చేశాం : విశ్వదేవ్ రాచకొండ

Manchu Manoj: ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవాలంటే ఆషామాషి కాదు : మంచు మనోజ్

Mohana Krishna Indraganti: రోషన్ మేకా, మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చిత్రం ప్రారంభం

Trivikram vs Naga Vamsi : త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగవంశీ మధ్య విభేదాలు? డివివి దానయ్యతో సినిమా భాగస్వామ్యం ?

Sidhu Jonnalagadda 10thfilm: సుకుమార్ రైటింగ్స్ లో సిద్దు జొన్నలగడ్డ 10వ చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments