శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 మే 2021 (15:15 IST)

కరోనా రోగి మృతదేహంపై బంగారు నగలు... వారు ఏం చేశారంటే..

కరోనా వైరస్ ఓ మహమ్మారిగా మారిపోయింది. ఇది అనేకమందిని హతరమార్చుతోంది. చిన్నాపెద్దా.. ధనిక పేద అనే తేడా లేకుండా హరిస్తోంది. అలా కరోనా వైరస్ బారినపడి చనిపోతున్న అయినవాళ్లను చివరుచూపు కూడా చాలా మంది నోచుకోలేక పోతున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో చనిపోయిన వారి ఒంటిపై ఉన్న ఆభరణాలు తీసేందుకు ముందుకురావడం సాహసమే. ఇలాంటి ఘటన కీసరలో మంగళవారం జరిగింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కీసర దాయరకు చెందిన వృద్ధురాలు కరోనాతో మృతి చెందింది.
 
ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. ఆమె ఒంటిపై రూ.లక్ష పైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. వాటిని కుటుంబసభ్యులు ఎవరూ తీసేందుకు ముందుకు రాలేదు. 
 
ఇందుకోసం ఓ వ్యక్తితో రూ.14 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ వ్యక్తి మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసి కుటుంబసభ్యులకు అందజేశారు. ఇది సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది.