గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 మే 2021 (22:41 IST)

అమెరికా నుంచి ఇండియాకు ఈజీగా డబ్బు పంపొచ్చు.. జీ-పే వుంటే చాలు

అమెరికాలో ఉన్న గూగుల్‌ పే వినియోగదారులకు శుభవార్త. మీరు ఇప్పుడు గూగుల్‌ పే ద్వారా ఇండియా, సింగపూర్‌లో ఉన్నవారికి సులభంగా డబ్బులు పంపించొచ్చు. 
 
యూఎస్‌లో ఉన్న వినియోగదారులకు ఈ సౌకర్యం అందించడానికి వెస్ట్రన్ యూనియన్ , వైజ్‌ లాంటి సంస్థలతో గూగుల్‌పే జట్టుకట్టింది. గూగుల్‌ పేలోకి ఈ సేవలు ఇంటిగ్రేట్‌ చేయడం వల్ల యూఎస్‌ నుంచి మన దేశానికి డబ్బులు పంపడం సులభతరమవుతుంది. చరిత్రలో ఇటువంటి ప్రయోగం ఇదే మొదటిసారి. 
 
మరికొన్ని దేశాలకు ఈ ఫీచర్‌ను తీసుకెళ్లాలని చూస్తోంది. వెస్ట్రన్ యూనియన్‌తో కుదిరిన ఈ భాగస్వామ్యం ద్వారా గూగుల్‌ పే క్రాస్‌బోర్డర్‌ సర్వీసును 200 దేశాలకు, వైజ్‌తో కలసి 80 విస్తరించాలని నిర్ణయించింది.
 
ఒకవేళ అమెరికా నుంచి డబ్బు పేమెంట్‌ చేయాల్సి వచ్చినప్పుడు ఏ సర్వీసు ద్వారా డబ్బులు వెళ్లాలి అని గూగుల్‌ పే అడుగుతుంది. అంటే వెస్ట్రన్ యూనియన్ లేక వైజ్‌ నుంచి వెళ్లాలా అని అర్థం. డబ్బుల పేమెంట్‌ అయిపోయాక వచ్చే రిసిప్ట్‌లో ఈ వివరాలను పొందుపరుస్తారు. దాని వల్ల తర్వాత ఎప్పుడైనా ట్రాక్‌ చేయాలంటే ఇది ఉపయోగపడుతుంది. మరోవైపు భద్రత విషయంలోనూ గూగుల్‌ గట్టి చర్చలు చేపట్టాలని చూస్తోంది.
 
గూగుల్‌ పే నుండి వెస్ట్రన్ యూనియన్ ద్వారా డబ్బులు పంపిస్తే ఎలాంటి అదనపు రుసుము, ట్రాన్స్‌ఫర్‌ ఫీజులు ఏమీ ఉండవు. అయితే వైజ్‌ ద్వారా డబ్బులు పంపిస్తే ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ రేటు, ట్రాన్స్‌ఫర్‌ ఫీజు వసూలు చేస్తారు.