మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (13:27 IST)

మోబిక్విక్ పేమెంట్ యాప్.. ఆన్‌లైన్‌లో హ్యాకర్ డేటా సేల్ ఆఫర్.. 84వేల డాలర్లు చెల్లిస్తే..?!

సెప్టెంబర్ నాటికి ఐపీఓకి వస్తానంటూ హడావుడి చేసిన మోబిక్విక్ పేమెంట్ యాప్ స్టార్టప్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీకి సంబంధించిన యూజర్ల సమాచారం మొత్తం తన చేతిలో ఉందంటూ ఓ హ్యాకర్ ఆన్‌లైన్‌లో సేల్ ఆఫర్ పెట్టడం కలకలం రేపింది. దీంతో అసలు మోబిక్విక్ యూజర్ల డేటా సేఫ్‌గా ఉందా లేదా అనే ఎంక్వైరీలు ప్రారంభం అయ్యాయి. 
 
మోబిక్విక్ సంస్థకి 35 మిలియన్ల యూజర్లు ఉన్నారు. దీంతో పాటే 8.2 టెరాబైట్స్ డేటా, 99,224,559 యూజర్ల ఫోన్ నంబర్లు ఈమెయిల్, పాస్‌వర్డ్స్, బ్యాంక్ అక్కౌంట్లు, కార్డ్ డీటైల్స్ ఇలా సమస్తం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో యూజర్లలో ఆందోళన ఓ రేంజ్‌కి చేరింది. డార్క్ వెబ్ పోర్టల్స్‌లో ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ ఉంటే సెర్చ్ ఆప్షన్ వాడితే చాలు వారికి సంబంధించిన సమాచారం అంతా వచ్చేలా సదరు హ్యాకర్ ఓ వెబ్ పోర్టల్ కూడా సెటప్ చేయడం సైబర్ క్రైమ్స్ ఏ రేంజ్‌కి వెళ్లాయో అర్ధమవుతోంది. 
 
అంతేకాదు ఈ అమ్మకానికి ఉన్న యాజర్లలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ కంపెనీల ఫౌండర్లు ఏడుగురు కైవైసీ డీటైల్స్ కూడా ఉన్నాయంటూ ప్రచారం సాగుతోంది. ఫ్రెంచ్ దేశానికి చెందిన సైబర్ ఎక్స్‌పర్ట్ ఎలియట్ ఆండర్సన్ ఉరఫ్ రాబర్ట్ బాప్టిస్ట్ ఈ విషయాన్ని వరస ట్వీట్ల ద్వారా సోషల్ మీడియాలో సోమవారం హోరెత్తించాడు. పైగా ఓ ట్వీట్‌లోనైతే ఇదంతా ఎప్పట్నుంచో జరుగుతుందని కూడా చెప్పడం మరీ కలకలం రేపుతోంది.
 
ఐతే మోబిక్విక్ మాత్రం ఈ పరిణామంపై పెదవి విప్పలేదు. కొంతమంది కావాలనే ఇలా ప్రచారం చేస్తున్నారని వాస్తవానికి తమ యూజర్లే డేటా ఫుల్ సేఫ్ అంటూ కొట్టిపారేసింది. ఎలాంటి సెక్యూరిటీ ల్యాప్స్ లేవని సింగిల్ లైన్‌లో చెప్పేసింది.
 
ఐతే హ్యాకర్ మాత్రం 1.5 బిటిసి అంటే 84వేల డాలర్లు చెల్లిస్తే చాలు, ఈ డేటా అంతా ఇచ్చేస్తానంటూ అమ్మకానికి పెట్టాడని అంటున్నారు. ఐతే ఈ ఇన్సిడెంట్ మరోసారి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ వాడకంపై ఉన్న సందేహాలను మరోసారి చర్చకు తెచ్చింది.