మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 25 మార్చి 2021 (22:58 IST)

కోట్పా 2020తో భారీ అసంతృప్తిని వెల్లడించిన మొట్టమొదటి యూజర్‌ సర్వే

నేటి సమాజంలో నిస్సహాయుల సమస్యల కోసం పరిష్కారాలను కనుగొనడానికి అంకితమైన స్వచ్ఛంద సంస్థ ప్రహార్‌ (పబ్లిక్‌ రెస్పాన్స్‌ ఎగైనెస్ట్‌ హెల్ప్‌లెస్‌నెస్‌ అండ్‌ యాక్షన్‌ ఫర్‌ రిడ్రెసల్‌) నేడు వాస్తవ పొగాకు ఉత్పత్తుల వినియోగదారుల నడుమ చేసిన మొట్టమొదటి అధ్యయన ఫలితాలను విడుదల చేసింది. ఈ అధ్యయనం ద్వారా ప్రతిపాదిత కోట్పా సవరణ బిల్లు 2020 ప్రభావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ అధ్యయనంలో ఢిల్లీ ఎన్‌సీఆర్‌, జైపూర్‌, లక్నో, రాంచి, కోల్‌కతా, గౌహతీ, ముంబై, నాగ్‌పూర్‌, వదోదర, భోపాల్‌, చెన్నై, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్‌ లాంటి 14 నగరాలలో 1986 మంది స్పందనదారులతో నిర్వహించింది.
 
ఈ అధ్యయనం గురించి శ్రీ అభయ్‌ రాజ్‌ మిశ్రా, అధ్యక్షులు- జాతీయ కన్వీనర్‌, ప్రహార్‌ మాట్లాడుతూ ‘‘మనం ఏదైనా చట్టం చేసేటప్పుడు దాని వల్ల ప్రభావితమయ్యే వర్గాల అభిప్రాయాలు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలన్నది మౌలిక సూత్రం. అయితే, కోట్పా సవరణ బిల్లు 2020 రూపకల్పనలో వినియోగదారుల అభిప్రాయాలు మరీ ముఖ్యంగా పొగాకు ఉత్పత్తుల వాస్తవ వినియోగదారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదు. ఇతర గ్రూప్‌ల్లా కాకుండా ఇక్కడ వినియోదారులు ఏదో ఒక సంస్ధ లేదంటే అసోసియేషన్‌కు ప్రాతినిధ్యం వహించరు. అందువల్ల, ప్రహార్‌ తనంతట తానుగా ఈ అభిప్రాయాలను తీసుకోవడంతో పాటుగా విధాన నిర్ణేతల దృష్టికి తీసుకువస్తుంది’’ అని అన్నారు.
 
‘‘మొట్టమొదటిసారిగా ఈ అధ్యయనంలో స్పష్టంగా వెల్లడైన అంశమేమిటంటే, ప్రతిపాదిత సవరణల పట్ల వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. ప్రతిపాదిత సవరణలు తమ ప్రాధమిక హక్కులకు, స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని భావిస్తుండటంతో పాటుగా కొన్ని కేసులలో అది వేధింపులు, మానసిక ఆందోళనలకూ కారణమవుతుందని భావిస్తున్నారు. కోట్పా 2020 ప్రతిపాదిత చట్టాలు, అంతర్జాతీయంగా పొగాకు వినియోగాన్ని తగ్గించడానికి బదులుగా స్వీయ ఓటమికీ కారణమవుతుంది. మార్కెట్‌ ఆకృతిని ఈ చట్టాలు మార్చడంతో పాటుగా అక్రమ, నాణ్యత లేని ఉత్పత్తుల వృద్ధికీ కారణమవుతుంది. మనకు కావాల్సింది స్థిరమైన అవగాహన కార్యక్రమాలు. తద్వారా పొగాకు నియంత్రణ సాధ్యమవుతుంది’’ అని ఆయన జోడించారు.
 
ఈ అధ్యయనం ప్రకారం లూజ్‌ సిగిరెట్ల కారణంగా తాము తక్కువగా పొగాకు ఉత్పత్తులు వినియోగించడం జరుగుతుందని 57% మంది భావిస్తుంటే, కేవలం 19% మంది మాత్రమే తక్కువ ధరలో ఇది లభిస్తుందంటున్నారు. కేవలం 7% మంది మాత్రమే పూర్తి ప్యాకెట్‌ కొనుగోలు చేయడం వల్ల తాము తక్కువ సిగిరెట్లు కాలుస్తామని అంటున్నారు.
 
అమ్మకపు కేంద్రాల వద్ద బ్రాండింగ్‌ నిషేదించడాన్ని తాము సమర్థించమని 76% మంది స్పందనదారులు చెబుతున్నారు. ఇక పొగాకు వినియోగ వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచడాన్ని 78%మంది వ్యతిరేకిస్తున్నారు. 37% మంది అయితే ఈ నిర్ణయం తమ ప్రాధమిక హక్కులకు భంగం కలిగించడమేనని భావిస్తున్నారు. ఇక 8% మంది అయితే 21 సంవత్సరాల లోపు వారు అక్రమ మార్గాల్లో పొగాకు ఉత్పత్తులు పొందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.