శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శనివారం, 4 మార్చి 2017 (18:17 IST)

అనూషపై కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందిచ్చి రేప్.. 20మందిని రాజేష్ మోసం చేశాడు.. మొత్తం 19 కేసులు?

రెండేళ్ల క్రితం అనూష నాగార్జునసాగర్‌లో పడి అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. తన కుమార్తె జీవితంతో ఆటాడుకున్న గుంటి రాజేష్‌ను అనూష తండ్రి శ్యామసుందర్ రెడ్డి మట్టుబెట్టాడు. రాజేష్‌పై ఇప్పటి

రెండేళ్ల క్రితం అనూష నాగార్జునసాగర్‌లో పడి అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. తన కుమార్తె జీవితంతో ఆటాడుకున్న గుంటి రాజేష్‌ను అనూష తండ్రి శ్యామసుందర్ రెడ్డి మట్టుబెట్టాడు. రాజేష్‌పై ఇప్పటికీ 19 కేసులున్నాయి. అనూష లాంటి ఎందరో యువతులు ఇతని వద్ద మోసపోయారని తెలిసింది. కిడ్నాప్‌ల నుంచి ల్యాండ్‌ సెటిల్‌మెంట్ల వరకు దందాలు చేసే రాజేష్‌పై.. అప్పటి సైబరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ అతడిపై పీడీయాక్ట్‌ చేశారు. గుంటి రాజేశ్‌ మొత్తం 20 మంది మహిళలను ప్రేమపేరుతో మోసం చేసినట్లు నిర్ధారించారు.
 
అయితే అనూష తండ్రి గతనెల 27న అర్ధరాత్రి ఆదిభట్ల ఠాణా పరిధిలోని తుర్కయాంజల్‌లో గుంటి రాజేశ్‌‌ను హత్య చేశారు. ఓ ప్లాట్ వ్యవహారంలో అనూషకు గుంటి రాజేష్‌తో పరిచయమైంది. ప్లాట్‌ నీదేనని.. అందుకు సంబంధించిన సంతకాలు పెట్టాలని చెప్పి తన ఇంటికి రాజేశ్ అనూషను పిలిపించుకున్నాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెపై అత్యాచారం చేశాడు. దాన్నంతా సెల్‌ఫోన్‌లో బంధించాడు. 
 
తనను పెళ్లిచేసుకోవాలని బెదిరించాడు. గత్యంతరం లేక అతడిని అనూష పెళ్లి చేసుకుంది. తర్వాత అతడికి రెండు పెళ్లిళ్లయ్యాయనే విషయం అనూషకు తెలిసింది. అప్పటి నుంచి అతడిని కలవడం మానేసింది. దీంతో ఆగ్రహించిన రాజేశ్‌ ఆమెను కిడ్నాప్‌ చేశాడు. దీనిపై అనూష తండ్రి శ్యామ్‌సుందర్‌రెడ్డి చైతన్యపురి ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
 
రాజేశ్‌ బారినుంచి తప్పించుకుని అనూష నాగార్జున సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కూతురు జీవితాన్ని నాశనం చేసిన రాజేష్‌ను అనూష తండ్రి హతమార్చాడు. తన కుమార్తెలా ఇంకో యువతి జీవితంతో అతను ఆడుకోడదని అతనని హతమార్చినట్లు శ్యామ్ తెలిపాడు.