Daily Horoscope
✕

టూ లెట్ బోర్డు పెడితో బాదుడే : షాకిస్తున్న జీహెచ్ఎంసీ

Written By ఠాగూర్
Updated: బుధవారం, 25 ఆగస్టు 2021 (08:38 IST)
భాగ్యనగరి వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తేరుకోలని షాకిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారం టు లెట్ బోర్డులు పెట్టే వారిపై కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే ఈ తరహా హెచ్చరిక చేసింది. తమ హెచ్చరికలను బేఖాతర్ చేస్తే వారిపై షాకిచ్చేలా జీహెచ్ఎంసీ కార్యరంగంలోకి దిగింది. తాజాగా మూసాపేట డివిజన్ పరిధిలో ఓ దుకాణ యజమానికి రూ.2 వేల జరిమానా విధించింది.
 
మోతీనగర్ పరిధిలోని పాండురంగ నగర్ చౌరస్తాలో స్థానిక వ్యాపారి ఎరమల్ల లాలయ్యగౌడ్ దుకాణం కోసం ఓ గదిని అద్దెకు ఇచ్చేందుకు ‘టు లెట్’ బోర్డు తగిలించారు. దీన్ని నేరంగా పరిగణించిన జీహెచ్ఎంసీ ఈడీ, డీఎం డైరెక్టర్ రూ.2 వేల జరిమానా విధిస్తూ మంగళవారం నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా ఈ-చలానా ద్వారా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
 
కాగా, టు లెట్ బోర్డులపై జరిమానా విధించనున్నట్టు జీహెచ్ఎంసీ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా టులెట్ బోర్డులు, పోస్టర్లు ఏర్పాటు చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయితే, ఈ విషయంలో స్పష్టత లేకపోవడంతో జనంలో గందరగోళం నెలకొంది.

అన్నీ చూడండి

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లకు అడ్డుకట్ట వేయాలని కోరిన మెగాస్టార్ చిరంజీవి

Rashmika: రష్మిక మైసా నుంచి మహిళా శక్తిని చాటే పవర్‌ఫుల్ ఆంథమ్‌ ఓ మైసా రే రిలీజ్

Deepika Padukone: షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె మూవీ కింగ్ నుంచి పాప్ సాంగ్‌

Rahul Vijay: డార్క్ క్రైమ్ జానర్‌లో అ (AH) చిత్రం రాబోతోంది

కల్ట్, వైల్డ్ డ్రామాగా డానీ చిత్రం ఉంటుంది - ఆశిష్ గాంధీ

తర్వాతి కథనం
Show comments