హైదరాబాదులో నేటి నుండి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్... 10 రోజుల పాటు..?
హైదరాబాదులో నేటి నుండి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగనుంది. ఇది పదిరోజులు కొనసాగనుంది. హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్ నత్తనడతన సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. నగరంలో వ్యాక్సిన్‌లు వేసుకునేందుకు ప్రజలు ప్రస్తుతం ఎక్కువగా తరలివస్తుండటంతో వ్యాక్సిన్‌ల కొరత ఏర్పడింది.
దాంతో వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద జనాలు క్యూ కడుతున్నారు. అయితే వ్యాక్సినేషన్‌లో వేగాన్ని పెంచేందుకు అధికారులు కీలక నిర్నయం తీసుకున్నారు. గల్లీలు, బస్తీల్లోకి వెళ్లి వ్యాక్సిన్‌లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఈ రోజు నుండే ఈ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. కోవిడ్ సంచార వాహనాల ద్వారా పది రోజుల పాటు అర్హులందరికీ వ్యాక్సిన్ లను ఇవ్వనున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అర్హులైన 70 శాతం మందికి వ్యాక్సిన్‌లను వేశారు.
నగరంలో మిగిలిన 30శాతం మందికి కూడా ఈ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా వ్యాక్సిన్ లు ఇచ్చేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం మొత్తం 200 వాహనాలను అధికారులు ఏర్పాటు చేశారు.