గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By డివి
Last Modified: మంగళవారం, 1 డిశెంబరు 2020 (13:54 IST)

జి.హెచ్‌.ఎం.సి. ఓటింగ్ గంద‌ర‌గోళం, చాలాచోట్ల ఓట్లు గ‌ల్లంతు, డ‌బ్బు పంపిణీ జోరు

జి.హెచ్‌.ఎం.సి. ఎన్నిక‌లు గ‌ల్లీ ఎన్నిక‌ల‌నీ దానికి బిజెపి.. నాయ‌కులు ఢిల్లీ నుంచి బారులు తీరుతున్నారంటూ.. కె.టి.ఆర్, కెసి.ఆర్‌.లు ప్ర‌చారంలో వ్యాఖ్యానించిన విష‌యం విదిత‌మే. అయితే ఆ గ‌ల్లీ ఎన్నిక‌ల‌లోనే ఓట‌ర్ల‌కు అన్యాయాలు జ‌రిగాయి. ముఖ్యంగా కూక‌ట్‌ప‌ల్లిలో టి.ఆర్‌.ఎస్‌. నాయ‌కులు కార్ల‌లో డ‌బ్బులు పంచుతుండ‌గా క‌నిపెట్టిన బి.జె.పి. కార్య‌క‌ర్త‌లు.. కారును చేదించి ప‌ట్ట‌కున్నా స్పీడ్‌గా వెళ్ళిపోయారు.
 
ఇది చూస్తూ పోలీసులు కారుకు అడ్డు వున్న వ్య‌క్త‌ల‌ను కింద‌కు దించారు. కానీ కారును ఆపే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఓల్డ్ మ‌లక్‌పేట‌లో ఏకంగా సి.పి.ఐ. గుర్తే మారిపోయింది. కంకి కొడ‌వ‌లికి బ‌దులు, సి.పి.ఎం. గుర్తు సుత్తి కొడ‌వ‌లి వ‌చ్చింది. దీంతో సి.పి.ఐ. నాయ‌కులు చాడ వెంక‌ట‌ర్‌రెడ్డి పోలీంగ్ ఆపేయ‌మ‌ని ఎల‌క్ష‌న్ అధికారిని కోర‌గా నిలిపివేశారు.
 
గ‌చ్చిబౌలికి ద‌గ్గ‌ర‌లో వున్న కాజాగూడ‌లో మ‌రీ దారుణం, అక్క‌డ పోలింగ్ బూత్‌లో 914 ఓట్ల‌కు బ‌దులు 194 ఓట్లే వున్నాయి. అదేమ‌ని ఓట‌ర్లు అడిగితే అధికారుల స‌రైన స‌మాధానం లేదు. పోలీసులు ఓట‌ర్ల‌ను బ‌య‌ట‌కు పంపివేయ‌డం విశేషం. వీటిని క‌వ‌ర్ చేస్తున్న మీడియాకు గ‌ల్లంతైన ఓట‌ర్లు ఏమ‌న్నాంటే మేం ఇక్క‌డ రాజ‌రెడ్డి కాల‌నీలో వుంటున్నాం. 20 ఏళ్ళుగా ఓట్లు వేస్తున్నాం. కానీ ఈసారి ఓటు లేద‌ని చెప్పడం ఆశ్చ‌ర్యంగా వుంది. మేం పెద్ద‌గా చ‌దువుకోలేదు. పోలింగ్ బూత్‌లో మా మాట‌ను కూడా విన‌డంలేద‌ని.. మ‌హిళ‌లు వాపోయారు.
 
ఓల్డ్ సిటీలో ఎం.ఐ.ఎం. డివిజ‌న్ల‌లో చాలా చోట్ల చ‌నిపోయిన వారి ఓట్లు వున్నాయి. బ‌తికున్న చాలామంది ఓట్లు గ‌ల్లంతయ్యాయి. అదేమ‌ని అడిగితే స‌రైన స‌మాధానం లేదని ఓట‌ర్లు వాపోతున్నారు. ఇదంతా టి.ఆర్‌.ఎస్‌. ప్ర‌ణాళిక‌బ‌ద్దంగా చేసింద‌ని బి.జె.పి. నాయ‌కుడు రాజాసింగ్ విమ‌ర్శిస్తున్నారు.
 
అన్నిటికంటే విశేషం ఏమంటే సినీ కార్మికులంద‌రూ వుండే చిత్ర‌పురి కాల‌నీకి ఈసారి ఓటింగ్ అదృష్టం లేదు. ఆ ప‌క్క‌నే కాజాగాడ అక్క‌డ జిహెచ్‌.ఎం.సి. ప‌రిధి అంట. చిత్ర‌పురి, మ‌ణికొండ రంగారెడ్డి జిల్లా కిందకు వ‌స్తాయ‌ని అది మున్సిపాలిటీ కింద‌కు వ‌స్తుంద‌ని ఓటింగ్ లేకుండా చేశారు.
 
కానీ... ఇటీవ‌లే క‌రోనాకు ముందు త‌ర్వాత కూడా ఇవ‌న్నీ జి.హెచ్‌.ఎం.సి. కింద‌కు వ‌స్తుంద‌ని నాయ‌కులు చెప్పారు. త్వ‌ర‌లో చేస్తున్నార‌ని మీడియాలో వార్త‌లు కూడా వ‌చ్చాయి. అందుకే  ప‌న్నులు జి.హెచ్‌.ఎం.సి. ప‌రిధిలో ప్ర‌కారం క‌ట్టాల‌ని 460 రూపాయ‌లు క‌ట్టే ప‌న్నులు 1,200 వ‌ర‌కు పెంచారంటూ అధికారులు చెప్పడం, కట్టడమూ జ‌రిగింది. మ‌రి ఇంటి ప‌న్నులు అలా క‌ట్టించుకుని ఇప్పుడు ఈ ప‌రిధి కాదంటూ చెప్ప‌డం ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డ‌మేనంటూ చిత్ర‌పురి కాల‌నీ వాసులు వాపోతున్నారు. ఈ విష‌యాన్ని సి.క‌ళ్యాణ్ దృష్టికి తీసుకు వ‌చ్చారు. ఇది ఏమేర‌కు వెళుతుందో చూడాలి.
 
ఇక జూబ్లీహిల్సులో కూడా మంద‌కొడిగా ఓటింగ్ నెల‌కొంది. కొద్ది మంది ప్ర‌ముఖులు మిన‌హా ఎవ్వ‌రూ ఓటింగ్ వినియోగించుకోలేదు. మీడియా స‌మాచారం ప్ర‌కారం 4 శాతం ఓటింగ్ న‌మోదైంది.