శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 మే 2022 (23:14 IST)

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. 24/7 ఇక ఆర్టీసీ సేవలు

tsrtc
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఇకపై నగరంలో ఆర్టీసీ సిటీ బస్సుల సర్వీసులు 24 గంటల పాటు అందుబాటులో ఉండనున్నాయి. సాధారణంగా అర్దరాత్రి 12 గంటలకు చాలా మార్గాల్లో సిటీ సర్వీసులు నిలిచిపోతాయి. ఆ సమయం తర్వాత ప్రయాణం చేయాలంటే ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిందే. 
 
కానీ ఇక సీన్ మారనుంది. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా సిటీ బస్సులు నడపాలని ఆర్టీసి నిర్ణయించింది. 
 
అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ సర్వీసులు నడుస్తాయి. ఆ తర్వాత ఎలాగూ రెగ్యులర్ బస్సులు డిపోల నుంచి బయలుదేరుతాయి. తాజా నిర్ణయంతో 24 గంటల పాటు ఆర్టీసీ సిటీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లయింది.
 
ఆర్టీసీ నైట్ బస్ సర్వీసుల్లోనూ అన్ని రకాల పాసులను అనుమతిస్తారు. ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్లను కూడా అనుమతిస్తారు. ఈ సర్వీసుల పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.